: ఎగ్జిట్ పోల్స్ ను కొట్టిపారేసిన కాంగ్రెస్
సార్వత్రిక ఎన్నికల్లో తాము పరాజయం పాలవుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేయడాన్ని కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. కొన్ని లక్షల మందికి చెందిన నమూనా సర్వే ద్వారా లోక్ సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేరని కాంగ్రెస్ అభిప్రాయపడింది.
"80 కోట్ల మంది ఓటర్లు ఉన్న దేశంలో కేవలం కొన్ని లక్షల మందితో చేసిన నమూనా సర్వేతో ఫలితాలను ఎలా అంచనా వేయగలరు? మే 16 వరకు వేచి చూద్దాం" అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ఇవాళ ఉదయం ట్విట్టర్ లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ కూడా ఎగ్జిట్; ఒపీనియన్ పోల్స్ ఫలితాలను కొట్టివేశారు. 2004, 2009 ఎన్నికల్లో ఇవి తప్పని తేలిపోయిందని, మే 16న వెలువడే నిజమైన ఫలితాల కోసం తమ పార్టీ ఎదురుచూస్తుందని షకీల్ వ్యాఖ్యానించారు.