: ఆయన మేధావే కానీ నాయకుడు కాదు... ప్రధానిపై సెటైర్లు
ప్రధాని మన్మోహన్ సింగ్ గొప్ప మేధావే కావచ్చు కానీ మంచి నాయకుడు మాత్రం కాదని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. తన బ్లాగులో మన్మోహన్ సింగ్ సమర్థుడైన అర్థికవేత్త అని... 1991లో గొప్ప సంస్కరణలు చేపట్టేందుకు పీవీ ప్రభుత్వం ఆయనకు ఎంతగానో సహకరించిందని... అందుకే ఆయన ఆర్థిక మంత్రిగా సత్తా చాటారని జైట్లీ తెలిపారు. సోనియా ఆయనను ప్రధానిగా ప్రకటించాక మన్మోహన్ పరిధి పరిమితమైపోయిందని, తన ప్రసంగాల ద్వారా జాతిని ప్రభావితం చేయలేకపోయారని జైట్లీ ఆరోపించారు. పార్టీకి విశ్వాసంగా ఉండే ప్రయత్నంలో మన్మోహన్ సింగ్ తన కర్తవ్యాన్ని విస్మరించారని ఆయన అభిప్రాయపడ్డారు.