: బోకోహరమ్ పై ఆపరేషన్ కు నైజీరియా సిద్ధం
నైజీరియా కారాగారంలో ఖైదీలుగా ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయాలని బోకోహరమ్ నాయకుడు అబుబకర్ షేక్ చేసిన డిమాండ్లను నైజీరియా ప్రభుత్వం తిరస్కరించింది. ఉగ్రవాదులను విడుదల చేస్తే... తాము బోర్నో జిల్లా చిబోక్ లోని ఓ పాఠశాల నుంచి అపహరించిన 276 మంది బాలికలను విడుదల చేస్తామంటూ షేక్ ఓ వీడియోను పంపారు. ఈ ప్రతిపాదనను నైజీరియా ప్రభుత్వం తిరస్కరించింది. కాగా కిడ్నాప్ కు గురైన బాలికలను విడుదల చేసేందుకు అమెరికాకు చెందిన ప్రత్యేక దళాలు నైజీరియా చేరుకున్నాయి. దీంతో బోకోహరమ్ తీవ్రవాదులపై ఆపరేషన్ కు నైజీరియా సిద్ధంగా ఉంది.