: కేసీఆర్ సొంత ఊరిలో టీఆర్ఎస్ విజయం
కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో టీఆర్ఎస్ అభ్యర్థి దేవమ్మ విజయం సాధించారు. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడకలో దేవమ్మ టీఆర్ఎస్ తరపున పోటీ చేసి 1056 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించారు. దేవమ్మకు 1170 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 114 ఓట్లు వచ్చాయి.