: మిలిటెంట్ల చెరలో 200 మంది నైజీరియా యువతులు


నైజీరియాలో ఇస్లామిక్ మిలిటెంట్లు అపహరించుకుపోయిన సుమారు 200 మంది అమ్మాయిలు నానా కష్టాలు పడుతున్నారు. వీళ్లలో కొందరు విద్యార్థినులు, మహిళలు కూడా ఉన్నారు. గత నెల 14న బోకోహారమ్ తీవ్రవాద సంస్థకు చెందిన సభ్యులు వీరిని మూకుమ్మడిగా అపహరించుకుపోయారు. తమ సహచరులను నైజీరియా ప్రభుత్వం అక్రమంగా జైళ్లలో పెట్టిందని, వారిని విడుదల చేస్తేనే తాము ఈ అమ్మాయిలను విడుదల చేస్తామని బోకోహారమ్ నాయకుడు అబూబక్ తెలిపారు.

బందీలుగా ఉన్న ఈ యువతులకు సంబంధించిన వీడియోలను తీవ్రవాదులు విడుదల చేశారు. వీరిని దట్టమైన అడవులు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉంచినట్లు తెలుస్తోంది. తీవ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న అమ్మాయిలను తక్షణమే విడుదల చేయాలని నైజీరియాతో పాటు అమెరికాలోనూ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News