: ఎగ్జిట్ పోల్స్ గొప్ప టైంపాస్: ఒమర్ అబ్దుల్లా


జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎగ్జిట్ పోల్స్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఒరిజినల్ ఫలితాలు వెలువడక ముందే వచ్చే ఎగ్జిట్ పోల్స్ గొప్ప టైంపాస్ లాంటివని ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు. ఈ నెల 16న వచ్చేవే అసలైన ఫలితాలని, మిగతావన్నీ కాలాన్ని గడిపేందుకేనన్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వారికే ఎక్కువ సీట్లు వస్తాయని నిన్న (సోమవారం) సాయంత్రం విడుదలైన ఎగ్జిగ్ పోల్స్ ఫలితాల్లో చెప్పడంపై ఈ మేరకు ఒమర్ స్పందించారు. అయితే, ఈ ఫలితాల్లో ఎంత క్రెడిబిలిటీ ఉందని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News