: నాన్ లోకల్ గా మెరిసిన 'లోకల్' బోయ్


ఐపీఎల్ 7లో వింతలు, విశేషాలకు కొదువ లేకుండా పోతోంది. డెక్కన్ ఛార్జర్స్ జట్టు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుగా మారడంతో లోకల్ ఫీల్ లేకుండాపోయింది. దీంతో నిన్న హైదరాబాదు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు కంటే ముంబై జట్టుకే మంచి మద్దతు లభించింది. పేరుకి హైదరాబాదు జట్టు అయినప్పటికీ ఒక్క హైదరాబాదీకి కూడా జట్టులో అవకాశం కల్పించలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ముంబై జట్టులో ఇద్దరు తెలుగు బిడ్డలు ఆడారు. టెక్నికల్ గా చూస్తే ముగ్గురు తెలుగు బిడ్డలు ఆ జట్టు సొంతం.

అంబటి తిరుపతి రాయుడు తెలుగు బిడ్డ, అతనితోపాటు స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా హైదరాబాదీయే. కాగా ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తాతగారి ఊరు వైజాగ్. దీంతో అతను కూడా సగం తెలుగువాడే. ఇవన్నీ తెలిసిన క్రికెట్ అభిమానులు ముంబై జట్టుకు ఊహించనంత మద్దతు పలికారు. దీనికి తోడు రాయుడు చెలరేగి ఆడడంతో ముంబై విజయం సాధించింది. పేరులో స్థానికత ఉంటే సరిపోదని, జట్టులో కూడా స్థానికత కనిపించాలని హైదరాబాదీలు కోరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News