: కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ జోరు
కర్నూలు జిల్లాలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. జిల్లాలోని పలు మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 53 జెడ్పీటీసీ, 785 ఎంపీటీసీ స్థానాలకు గత ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించారు. 53 జెడ్పీటీసీ స్థానాల్లో 196 మంది, 785 ఎంపీటీసీ స్థానాల్లో 2,213 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
బేతంచర్ల మండలం ముద్దవరం, సీతారామపురం ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోసిగి మండలం అడసనూరు, నంద్యాల మండలం పుట్లూరు, రాయచోటి మండలం మాధవరం ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. జూపాడు బంగ్లా మండలంలోని పప్పూరు, మండ్లెం, నంద్యాల మండలం నిష్ణ, పగిడ్యా మండలం నెహ్రూ నగర్, నంద్యాల మండలం ఓడుమాలపురం, తుగ్గలి మండలం రాంపురం, నందికొట్కూరు మండలం శాసనకోట, ఎమ్మిగనూరు మండలం గుడికల్లు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది.