: స్మృతి ఇరానీకి కలసివచ్చిన ఎన్నికల నిబంధన


స్మృతి ఇరానీకి ఎన్నికల కమిషన్ నిబంధనలు కలిసివచ్చాయి. దీంతో ఆమె అనర్హత వేటు నుంచి తప్పించుకున్నారు. అమేథీ లోకసభ బీజేపీ అభ్యర్ధి స్మృతి ఇరానీ మోడీ ర్యాలీ సందర్భంగా భారీ జనసమీకరణ చేశారు. దీంతో ఆ రోజు ఆమె పెద్దఎత్తున ఖర్చుచేశారని జాతీయ ఎన్నికల సంఘం అధికారులు అంచనావేశారు. దీంతో స్మృతిపై అనర్హత వేటు తప్పదని వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన 30 రోజుల వరకు ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలు అందజేయవచ్చు.

ఇదే నిబంధన ఇప్పుడు ఆమె పాలిట వరంగా పరిణమించింది. దీంతో ఆమె ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలు ఎన్నికల కమిషన్ కు ఇంకా అందజేయలేదు. అవి అందిన తరువాత అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు సంబంధించిన వివరాలపై పరిశీలన ఉంటుంది. ఆ పరిశీలనలో అభ్యర్థి 70 లక్షలకు మించి ఖర్చు చేసినట్టయితే ఈసీ అనర్హత వేటును వేయడానికి అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News