: హెచ్‌ఐవీ విషయంలో సెల్ఫ్‌ టెస్టులు బెటర్‌


మారుతున్న సమాజంలో శృంగార సంబంధాలు విచ్చలవిడి అవుతున్నాయి. తమ ఆరోగ్యం విషయంలో, ప్రాణాంతకమైన హెచ్‌ఐవీ వైరస్‌ విషయంలో తమ మీద తమకే అనుమానాలు కలిగేవాళ్లు ఎందరో ఉంటున్నారు గానీ.. వివిధ కారణాల నేపథ్యంలో ఆస్పత్రి, లేదా ఎయిడ్స్‌ కేంద్రాల వరకు వెళ్లి నిర్ధరణ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వెనుకాడుతుంటారు. అలాంటి వారికి హెచ్‌ఐవీ సెల్ఫ్‌ టెస్టులు ఎంతో ఉపయోగకరమని.. కెనడాలోని మెక్‌గిల్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ నిటిక సలహా ఇస్తున్నారు.
 
సెల్ఫ్‌ టెస్టులు చాలా సరళమని, లాలాజలం నమూనాతో ఇంట్లోనే పరీక్షించుకోవచ్చునని, 20 నిమిషాల్లో ఫలితం తెలుస్తుందని సూచిస్తున్నారు. ఇతరులకు తెలియకుండా వైద్యపరీక్షలు నిర్వహించుకోవడం లేదా.. తమ ఉనికి బయటపడకుండా ఫోను ద్వారా ధ్రువపరచుకోవడం అనే మార్గాలకే హెచ్‌ఐవీ పరీక్షల విషయంలో ఎక్కువ స్పందన లభిస్తున్నట్లు డాక్టర్‌ నిటిక బృందం జరిపిన పరిశోధనలు తేల్చాయి. 

  • Loading...

More Telugu News