: విదేశీ మహిళపై డ్రైవర్ అత్యాచార యత్నం
భారత పర్యటనకు వచ్చిన అమెరికా పర్యాటకురాలిపై కారు డ్రైవర్ అత్యాచారం చేయబోయాడు. అమెరికాకు చెందిన ఓ మహిళ ఆదివారం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ లోని రుషికేశ్ కు కారులో బయల్దేరింది. టాక్సీ డ్రైవర్ మధ్యలో భోజనం కోసం ఆగినప్పుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడైన డ్రైవర్ సమయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు.