: తెలంగాణలో సైకిల్ జోరు... కాంగ్రెస్, టీఆర్ఎస్ లకు పోటీ
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ఈ రెండు పార్టీలకు తానేం తక్కువ కాదన్న రీతిలో టీడీపీ ఫలితాలను రాబడుతోంది. ఎంపీటీసీ ఫలితాల్లో సైకిల్ జోరు పెంచింది. ఇప్పటి వరకు అందిన ఎంపీటీసీ ఫలితాల్లో... కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు రాగా టీఆర్ఎస్ 42 స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా 34 ఎంపీటీసీలను సైకిల్ కైవసం చేసుకుంది. వామపక్షాలు 3 స్థానాలను కైవసం చేసుకోగా, ఇతరులు 56 స్థానాల్లో గెలిచారు. జడ్పీటీసీలకు చెందిన ఫలితాలు ఇంకా వెలువడలేదు.