: సీమాంధ్రలో టీడీపీ 188, వైకాపా 138
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం... టీడీపీ 188 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా 138, కాంగ్రెస్ 8, వామపక్షాలు 4, ఇతరులు 87 స్థానాల్లో గెలిచారు. జడ్పీటీసీలకు సంబంధించి ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో ఒక స్థానంలో ఫలితం వెలువడింది. ఈ ఒక్క స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది.