: ఆ ముగ్గురి కలయికే మోడీ: అమర్ సింగ్
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేనే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్జేడీ నేత అమర్ సింగ్ మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవిస్తామని చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, ఆ పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, దివంగత నేత ప్రమోద్ మహాజన్ లలోని ఛాయలు ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలో కనిపిస్తున్నాయన్నారు.