: 25 ఏళ్ల తర్వాత ఏజెంటును నియమించుకున్న టీడీపీ
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవగుడి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఇక్కడ పోలీసు అధికారులపై కూడా దాడులు జరిగాయి. దీంతో ఇక్కడ ఈ రోజు రీపోలింగ్ జరుగుతోంది. 200 మంది పోలీసులు బందోబస్తు కల్పిస్తుండగా... స్వయంగా జిల్లా ఎస్పీ అక్కడ తిష్ఠ వేశారు. మరో విషయం ఏమిటంటే... 25 ఏళ్ల తర్వాత దేవగుడిలో తెలుగుదేశం పార్టీ పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను నియమించుకుంది. జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి స్వయంగా ఏజెంట్ గా కూర్చున్నారు.