: తొమ్మిది జిల్లాల్లో ప్రారంభమైన రీపోలింగ్
రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరిధిలోని 29 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ లోని కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 12, సీమాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కృష్ణా, కడప జిల్లాల్లో 17 కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ జరుగుతుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పర్యవేక్షిస్తున్నారు.