: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నేడే
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఈ రోజు జరగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు నాలుగు కోట్ల మంది ఓటర్ల నాడి ఈ రోజు సాయంత్రానికి తెలియనుంది. బ్యాలెట్ విధానం కావడంతో రాత్రికి పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో ఏప్రిల్ 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా 1096 జడ్పీటీసీ, 16,589 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 5034 మంది అభ్యర్ధులు పోటీపడగా, ఎంపీటీసీ స్థానాలకు 53,345 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు.