: ఉత్తరప్రదేశ్ లోని 11 పోలింగ్ కేంద్రాల్లో రేపు రీ పోలింగ్
ఉత్తరప్రదేశ్ లోని 11 పోలింగ్ కేంద్రాల్లో మే 13న రీపోలింగ్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ముజఫర్ నగర్, బదౌన్, ఫిరోజాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో రిగ్గింగ్, ఇతర అవకతవకలు జరిగినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో ఈ స్ధానాల్లో రేపు రీ పోలింగ్ నిర్వహించనున్నారు. బదౌన్, ఫిరోజాబాద్ లోక్ సభ స్థానాల నుంచి సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మేనల్లుళ్లు అక్షయ్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు.