: ఎగ్జిట్ పోల్స్ ... ఎన్డీయే కూటమికి 289 సీట్లు... కాంగ్రెస్ 101


జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమి 289 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ కేవలం 101 స్థానాల్లో గెలుపొందుతుందని పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు వెల్లడించారు. అందులో పశ్చిమ బెంగాల్ లో మమతాబెనర్జీ మరోసారి తన సత్తా చాటనున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ కే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. తమిళనాడులో అన్నా డీఎంకే విజయపథాన సాగుతుందని తెలిపారు. జయలలిత ధాటికి డీలాపడ్డ డీఎంకే కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది. కాగా, బీజేపీ రెండు స్థానాలు గెలవనుండడం విశేషం.

  • Loading...

More Telugu News