: పోలింగ్ కేంద్రం వద్ద కొట్టుకున్న కార్యకర్తలు... 15 మందికి కత్తిపోటు గాయాలు
పశ్చిమ బెంగాల్ లో సార్వత్రిక ఎన్నికల చివరి రోజు పోలింగ్ సందర్భంగా బహీర్ హట్ నియోజకవర్గంలోని హరోరాలో రెండు పోలింగ్ కేంద్రాల వద్ద సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 15 మందికి తీవ్ర కత్తిపోటు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.