: మున్సి‘పోల్స్’ ఫలితాలతో వైఎస్సార్సీపీకి షాక్
మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాదులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సందడి లేకుండా పోయింది. సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో, వైఎస్సార్పీపీ దిగ్భ్రాంతి చెందింది. అర్భన్ ప్రాంతాల్లో టీడీపీకి పట్టు ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ గట్టి పోటీనిచ్చిందని ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు తెలిపారు. అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో విజయం వైఎస్సార్సీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన గట్టు రామచంద్రరావు ఇవాళ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ప్రజలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వైఎస్సార్సీపీ కృషి చేస్తుందనీ ఆయన అన్నారు.