: ఓటర్ ని కొట్టిన ఎమ్మెల్యేపై కేసు


బీహార్ లోని గోపాల్ గంజ్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓ వ్యక్తిని కొట్టారనే ఆరోపణలతో జేడీయూ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నయాగావ్ తులసియా గ్రామంలోని ఓ పోలింగ్ బూత్ లో జేడీయూ కుచ్యాకోట్ ఎమ్మెల్యే అమరేందర్ కుమార్ పాండే ఓటు వేసి బయటకు వస్తూ, జేడీయూకు ఓటేయలేదని ఓ వ్యక్తిని కొట్టారు.

అతను కాంగ్రెస్ మద్దతుదారు కావడంతో ఎమ్మెల్యే చేయిచేసుకున్నారని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమరేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాను ఎవ్వరినీ కొట్టలేదని, తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని అమరేందర్ తెలిపారు.

  • Loading...

More Telugu News