: ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబే ముఖ్యమంత్రి: సబ్బం హరి
టీడీపీ అధినేత చంద్రబాబే ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అవుతారని పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ధీమా వ్యక్తం చేశారు. హంగ్ మున్సిపాలిటీలన్నీ టీడీపీకే వెళతాయని చెప్పారు. సీమాంధ్ర మున్సిపాలిటీ ఫలితాల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ ఇకపై ఎన్నటికీ ఏపీలో కోలుకోలేదన్నారు. పట్టణ ఓటర్లందరూ జగన్ ను ప్రత్యామ్నాయంగా ఒప్పుకోలేదని సబ్బం పేర్కొన్నారు.