: ఏడు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఖాతా తెరవలేదు
టీఆర్ఎస్ ఏడు మున్సిపాలిటీల్లో కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కు ఉనికి లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలు, నల్గొండ జిల్లాలోని భువనగిరి, కోదాడ, హుజూర్ నగర్ మున్సిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్ పేట్, బడంగ్ పేట్ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.