: సీమాంధ్రలోని రెండు జిల్లాల్లో కాంగ్రెస్ 'జీరో'


రాష్ట్ర విభజనతో సీమాంధ్రులకు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతటి వ్యతిరేకత ఏర్పడిందో అన్న దానికి ఈ నాటి ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. సీమాంధ్రలోని మొత్తం 13 జిల్లాల్లో... రెండు జిల్లాల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుపొందలేకపోయింది. కడప, కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్క స్థానం గెలుచుకుంది. కర్నూలు జిల్లాలో 2, శ్రీకాకుళం జిల్లాలో 3 స్థానాలు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 13 స్థానాలను గెలుపొందింది.

  • Loading...

More Telugu News