: 'అయామ్ నాట్ ఏ గాడ్' అంటోన్న మాస్టర్ బ్లాస్టర్


అమోఘమైన బ్యాటింగ్ శైలి, చెదరని ధృఢ సంకల్పం, అనితరసాధ్యమైన రికార్డులు.. ఇవన్నీ ఒకే వ్యక్తికి సాధ్యమైతే అతను సచిన్ టెండూల్కర్ అవుతాడు. అభిమానుల మదిలో దేవుడై కొలువుంటాడు. కానీ, తాను మానవమాత్రుడినే అని సాక్షాత్తూ ఆ క్రికెట్ దేవుడే అంటున్నాడు. తానూ అందర్లాగే పొరబాట్లు చేస్తుంటానని వినమ్రంగా చెప్పి, తన వ్యక్తిత్వానికి మరింత వన్నెలద్దుకున్నాడు. బెంగళూరులో 'ఈట్ ఎన్ మీట్ సచిన్' కాంటెస్ట్ లో ఈ మాస్టర్ బ్లాస్టర్ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా చిన్నారులతో మాట్లాడుతూ, బాల్యంలో గవాస్కర్, రిచర్డ్స్ ల ఆట చూస్తూ పెరిగానని చెప్పాడు. వాళ్ళలాగే తయారవ్వాలని ఆకాంక్షించినట్టు వెల్లడించాడు. ఇక చారిత్రాత్మక 100వ సెంచరీ గురించి చెబుతూ, సెంచరీ పూర్తయిన వెంటనే 'ఈ శతకం ఇంత ఆలస్యం ఎందుకు చేశావు?' అని దేవుణ్ణి ప్రశ్నించానని వెల్లడించాడు. బాల్యంలో చదువు, క్రికెట్ మధ్య చక్కని సమన్వయం పాటించేవాణ్ణని చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్లో ఇన్నేళ్ళు తాను ఎలా కొనసాగానో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుందంటూ ముగించాడు. 

  • Loading...

More Telugu News