: బెంగాల్ 'శారదా చిట్ ఫండ్ స్కామ్' దర్యాప్తుకు 'సిట్' ఏర్పాటు
సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్ శారదా చిట్ ఫండ్ స్కామ్ దర్యాప్తుకు జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో సీబీఐ 'సిట్' (ప్రత్యేక దర్యాప్తు సంస్థ)ను ఏర్పాటు చేసింది. ఈ స్కాంలో దర్యాప్తు చేపట్టాలంటూ నాలుగు రోజుల కిందట సర్వోన్నత న్యాయస్థానం సీబీఐను ఆదేశించడంతో వెంటనే చర్యలు చేపట్టింది. బెంగాల్, ఒడిషా, బీహార్ ప్రాంతాల్లోని పలువురు ఈ చిట్ ఫండ్ లో పెట్టుబడి పెట్టగా, రూ.10వేల కోట్ల స్కాం జరిగిందని ఆరోపణలు వచ్చాయి.