: గద్వాల్, షాద్‌నగర్ లో కాంగ్రెస్ విజయకేతనం
మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్, షాద్ నగర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. వనపర్తిలో కాంగ్రెస్ - 7 వార్డులు, టీడీపీ - 9, బీజేపీ 4, టీఆర్ఎస్ 2 వార్డుల్లో విజయం సాధించింది. కల్వకుర్తిలో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్, టీడీపీ చెరో 6 వార్డుల్లో గెలుపొందగా, వైఎస్సార్సీపీ 5, బీజేపీ 3 వార్డులను కైవసం చేసుకుంది. నాగర్ కర్నూలులో హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో 6 వార్డుల్లో విజయం సాధించాయి. బీజేపీ 7 వార్డుల్లో గెలిచింది.