: ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రికల్ విమానం
ఈ విమానానికి సంప్రదాయ విమానాల వలే పెట్రోల్ ఆధారిత ఇంధనం అక్కర్లేదు. కొంచెం కరెంటు ఉంటే చాలు గమ్యంవైపు పరుగులు తీస్తుంది. ఇలాంటి తొలి ఎలక్ట్రికల్ విమానాన్ని ఎయిర్ బస్ రూపొందించింది. ఇది ఫ్రాన్స్ లోని బోర్డాక్స్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయి 10 నిమిషాలపాటు విజయవంతంగా గాల్లో ప్రయాణించింది. ఇందులో 120 లిథియం అయాన్ బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి చార్జ్ చేస్తే గంటపాటు ప్రయాణానికి సరిపోతుంది. గంటపాటు ప్రయాణానికి కేవలం 16 డాలర్ల ఖర్చు మాత్రమే అవుతుందని ఎయిర్ బస్ వెల్లడించిది. అదే పెట్రోల్ ఆధారిత ఇంధనమైతే 55 డాలర్లు వ్యయం చేయాల్సి ఉంటుంది.