: టీడీపీ పగ్గాలు చేపడుతుంది... చంద్రబాబు సత్తా చాటారు: ప్రకాశ్ జవదేకర్
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సత్తా చాటారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వస్తుందని మున్సిపల్ ఫలితాల ద్వారా రుజువైందని అన్నారు. టీడీపీ ఆధిక్యం ప్రదర్శించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.