: ఫుట్ బాల్ స్టేడియంలో తొక్కిసలాట... 15 మంది మృతి
కాంగోలోని ఓ ఫుట్ బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కిన్షాసాలో నిన్న జరిగిన మ్యాచ్ లో లుబుంబాషి జట్టు చేతిలో స్థానిక జట్టు ఓటమి పాలైంది. దీంతో స్థానిక జట్టు మద్దతుదారులు పోలీసులపై దాడికి యత్నించారు. వారు టియర్ గ్యాస్ ప్రయోగించడం తొక్కిసలాటకు దారి తీసిందని మంత్రి ఎమ్యాన్యుయేల్ అక్వేతి తెలిపారు. గాలి ఆడక 15 మంది మరణించారని, 24 మంది గాయపడ్డారని చెప్పారు.