: ఈ రెండు పట్టణాల్లో గాలి పీలిస్తే అంతే..!
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ పట్టణాల్లో వాయు కాలుష్యం పరిమితులు దాటేసింది. ప్రమాదకర స్థాయికి చేరి ప్రజల జీవనానికి ముప్పుగా పరిణమించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్న 20 పట్టణాల్లో 13 భారత్ లోనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. గ్వాలియర్, రాయ్ పూర్ అయితే, ప్రపంచంలోనే మొదటి నాలుగు కాలుష్య కాసార నగరాల్లో నిలిచాయి. ఉండాల్సిన స్థాయి కంటే ఇక్కడ మూడు రెట్లు అధికంగా కాలుష్యం ఉంది. 91 దేశాల్లోని 1,600 పట్టణాల్లో వాయు కాలుష్యంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం నిర్వహించగా, 2011 కంటే పెరిగినట్లు వెల్లడైంది.