: కడప జిల్లాలో టీడీపీ హవా... వైకాపాకు ఎదురుదెబ్బ
వైఎస్సార్సీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో ఊహించని ఫలితాలు వచ్చాయి. జిల్లా మొత్తాన్ని వైకాపా స్వీప్ చేస్తుందని భావిస్తున్న తరుణంలో... టీడీపీ ఆధిక్యత ప్రదర్శించింది. టీడీపీ 4 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, వైకాపా 3 మున్సిపాలిటీలలో మాత్రమే గెలుపొందింది. ఎర్రగుంట్ల, పులివెందుల, రాయచోటి మున్సిపాలిటీల్లో వైకాపా గెలుపొందగా... మైదుకూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేల్ లలో టీడీపీ జయకేతనం ఎగురవేసింది.