: రాయదుర్గంలో ఖాతా కూడా తెరవని వైకాపా... ఘోర పరాభవం
అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్సార్సీపీకి ఘోర పరాభవం ఎదురైంది. మొత్తం 25 వార్డుల్లో... 24 వార్డుల్లో టీడీపీ జయకేతనం ఎగురవేయగా, ఒక్క ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. వైఎస్సార్సీపీ ఖాతా కూడా తెరవలేదు. శాసనసభ ఎన్నికల్లో రాయదుర్గంలో వైకాపా అభ్యర్థి గెలుస్తారనే అంచనాలు ఉన్న నేపథ్యంలో, ఇక్కడ టీడీపీ గెలుపు ఆసక్తికరంగా మారింది.