: జేఎన్టీయూలో అక్రమ నియామకాలు ఆపాలి: పొన్నాల
హైదరాబాదులోని జేఎన్టీయూలో అక్రమ నియామకాలు జరుగుతున్నట్టు తెలిసిందని... ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నియామకాలను ఆపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. నియామకాలను ఆపేలా చూడాలని పొన్నాలను జేఎన్టీయూ విద్యార్థులు కోరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులపై ఇతర పార్టీలు అభ్యర్థులను కూడా నిలబెట్టలేకపోయాయని తెలిపారు.