: వారణాసి బీజేపీ కార్యాలయంలో తనిఖీలు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో ఉన్న ఆ పార్టీ కార్యాలయాన్ని పోలీసులు, ఎన్నికల అధికారులు సోదా చేశారు. కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ వాహనంలో ప్రచార సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా... ఎన్నికల అధికారులు, పోలీసులు వివక్షతో వ్యవహరిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు దిగారు.