: నా వల్ల టీఆర్ఎస్ లో చీలిక రాదు: హరీష్ రావు
టీడీపీ, కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తూ... టీఆర్ఎస్ ను అయోమయంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. తన వల్ల టీఆర్ఎస్ లో చీలిక వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన గురించి తప్పుగా మాట్లాడుకోవడాన్ని టీడీపీ, కాంగ్రెస్ నేతలు మానుకోవాలని సూచించారు.