: ఏర్పాట్లు పూర్తి కాలేదు... వారం తర్వాత రండి: కేదార్ నాథ్ అర్చకులు


ప్రఖ్యాత శైవ క్షేత్రం కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు గడిచింది. అయితే, అక్కడ వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు. కేదార్ నాథ్ లో ఇంకా మంచు భారీగా కురుస్తోంది. దీంతో గుప్తాక్షి వద్ద 144 మంది యాత్రికులను నిలిపివేశారు. కేదార్ నాథ్ లో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని... వారం రోజుల తర్వాతనే భక్తులు రావాలని ఆలయ ప్రధాన అర్చకులు భీమశంకర్ లింగా విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News