: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గుజరాత్ గవర్నర్
గుజరాత్ గవర్నర్ కమలా బేనివాల్ అనారోగ్యానికి గురవడంతో ఆమెను గాంధీనగర్ లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. నిన్న రాత్రి ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని... అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.