: 36 మంది శ్రీలంక జాలర్లను అదుపులోకి తీసుకున్న మెరైన్ పోలీసులు
భారత జలాల్లోకి ఏడు బోట్లలో అక్రమంగా ప్రవేశించిన 36 మంది శ్రీలంక జాలర్లను మెరైన్ పోలీసులు అదుపులోని తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న 4 టన్నుల సోనా చేపలను మత్యశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని రేపు వేలం వేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.