: టెస్ట్ మ్యాచ్ లకు గుడ్ బై చెప్పిన స్యామీ
వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ స్యామీ టెస్టు మ్యాచ్ లకు గుడ్ బై చెప్పాడు. టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్యామీని వెస్టిండీస్ బోర్టు ఆ పదవి నుంచి తొలగించి... వికెట్ కీపర్ దినేష్ రామ్ దిన్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం వెలువడిని కొద్దిసేపటికే స్యామీ టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఇప్పటి దాకా 38 టెస్టులు ఆడిన స్యామీ 30 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ ఫార్మాట్ లో మొత్తం 1323 పరుగులు సాధించడమే కాకుండా, 84 వికెట్లు పడగొట్టాడు. అయితే, వన్డేలు, టీ20ల్లో స్యామీ కొనసాగుతాడని విండీస్ బోర్డు వెల్లడించింది.