: వారణాసిలో మోడీ ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవు: రాజ్ నాథ్ సింగ్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని వారణాసి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ను కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతవుతాయని అన్నారు. సర్వేలన్నీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని ఆయన తెలిపారు. ఎన్డీయే 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తన సొంత రాష్ట్రం నుంచి మోడీ ప్రధానిగా ఎన్నిక కావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.