: నేడు రాజమండ్రి, విజయవాడలో రాజధాని ఎంపిక కమిటీ


సీమాంధ్రకు రాజధానిని ఎంపిక చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఈ రోజు రాజమండ్రి, విజయవాడ నగరాలను సందర్శించనుంది. రాజధాని ఏర్పాటుకు అనువైన స్థలాల లభ్యత, మౌలిక సదుపాయాలు, ఇతర అర్హతలతో ఈ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఆగస్ట్ నాటికి సమర్పించనుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో నిన్న విశాఖలో పర్యటించిన కమిటీ సభ్యులు ఈ రోజు రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకుని అక్కడ పలు ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం మునిసపల్, ఇతర శాఖల అధికారులతో సమావేశమై, అనంతరం విజయవాడ చేరుకుంటారు. సాయంత్రానికి విజయవాడలో పర్యటిస్తారు. రేపు గుంటూరులో పర్యటించనున్నారు.

  • Loading...

More Telugu News