: అర్ధరాత్రి నడిరోడ్డుపై బైక్ రేసింగులు.. యువకుల అరెస్ట్
శనివారం వచ్చిందంటే చాలు, హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్లపై కుర్రాళ్లు బైకులతో విన్యాసాలు చేస్తుంటారు. పోటాపోటీగా రేసులు కూడా నడుస్తుంటాయి. సంపన్నుల పిల్లలకు ఇదో సరదా ఆటగా మారిపోయింది. ఇలానే జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ రోడ్డులో నిన్న అర్ధరాత్రి బైక్ రేసింగులు నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. పది రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో రేసింగులకు పాల్పడిన యువకులను అదుపులోకి తీసుకుని మందలించి వదలిపెట్టిన విషయం తెలిసిందే. అడపాదడపా పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం, హెచ్చరించి వదలివేయడంతో... రేసులు ఆగడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో ప్రయాణించే ఇతర వాహనదారులకు అభ్రదత నెలకొంది.