: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం వేచియున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, కాలి నడకన వచ్చే భక్తుల దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.