: నల్లమలలో పులుల లెక్క తేలనుంది
నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలో పులుల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 14 వరకు ఈ లెక్కింపు కొనసాగనుందని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఖాదర్ వలీ తెలిపారు. శ్రీశైలంలో ఆయన మాట్లాడుతూ, నల్గొండ, మహబూబ్ నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న రిజర్వు ఫారెస్టు పరిధిలో లెక్కింపు జరుపనున్నామని అన్నారు. శాస్త్రీయపద్దతిలో పులుల లెక్కింపు జరుగుతుందన్న ఆయన, ఫారెస్టులో ఉన్న పులుల సంఖ్యపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు.