: బోర్డు నిర్ణయంతో విండీస్ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన స్యామీ
వెస్టిండీస్ టెస్టు జట్టు కెప్టెన్ గా స్యామీని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న వెంటనే స్యామీ విండీస్ బోర్డుకు షాక్ ఇచ్చాడు. తాను టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు స్యామీ ప్రకటించాడు. అతని నిర్ణయంతో అవాక్కయిన విండీస్ బోర్డు టెస్టు క్రికెట్ నుంచి స్యామీ తప్పుకున్నా ఇతర ఫార్మాట్లలో ఆడతాడని తెలిపింది. విండీస్ టీ ట్వింటీ జట్టుకు స్యామీ కెప్టెన్ గా కొనసాగుతాడని విండీస్ బోర్డు తెలిపింది. 30 టెస్టులకు సారధ్యం వహించిన స్యామీ 8 విజయాలు, 12 పరాజయాలు, 10 డ్రాలతో టెస్టు క్రికెట్ ముగించాడు.