: తృణమూల్ తో బెంగాల్ ఓటర్లు విసిగిపోయారు: జైట్లీ
పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో ఓటర్లు విసిగిపోయారని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. వారణాసిలో ఆయన మాట్లాడుతూ, యూపీ తరువాత బెంగాల్ లోనే బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లెఫ్ట్ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత తృణమూల్ కి అధికారం కట్టబెట్టిందని, ఈ ప్రభుత్వ తీరు నానాటికీ తీసికట్టుగా ఉండడంతో ఓటర్లు విసిగిపోయారని మమత ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. బెంగాల్ లో బీజేపీ ఎదగడం ఇష్టం లేని మమతాబెనర్జీ తరచూ మోడీపై విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.