: జహీర్ స్థానంలో ప్రవీణ్ కుమార్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-7లో ముంబై ఇండియన్స్ కీలక బౌలర్ జహీర్ ఖాన్ గాయపడిన సంగతి తెలిసిందే. జహీర్ స్థానంలో మరో బౌలర్ ప్రవీణ్ కుమార్ ను తీసుకుంటామని ఐపీఎల్ యాజమాన్యానికి ముంబై ఇండియన్స్ విజ్ఞప్తి చేసింది. దీనికి ఐపీఎల్ సాంకేతిక కమిటీ ఈరోజు ఆమోదముద్ర వేసింది. దీంతో, ఐపీఎల్-7 ఆటగాళ్ల కోసం జరిగిన వేలంపాటలో ఏ జట్టూ తీసుకోని ప్రవీణ్ కుమార్ కు... ఐపీఎల్ లో ఆడే అవకాశం దక్కినట్టైంది.