: ఈ నియోజకవర్గం ప్రత్యేకం... మీరంతా వెళ్లిపోండి: అధికారులు
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గానికి మరో 48 గంటల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ తిష్ట వేసిన స్థానికేతర నాయకులందర్నీ నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు. వారణాసిలో బీజేపీ, ఆప్ కి చెందిన కీలక నేతలంతా ప్రచారం కోసం ఉన్నారు.
దీంతో అక్కడి అధికారులు రానున్న రెండు రోజులు వారణాసిలోని హోటళ్లు, అతిథి గృహాల్లో తనిఖీలు నిర్వహించి స్థానికేతరులను పంపించేస్తామని తెలిపారు. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులు, అమిత్ షా, అరుణ్ జైట్లీ సహా అందరూ నియోజకవర్గాన్ని వీడాల్సిందేనని వారు స్పష్టం చేశారు. నేటి సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు స్థానికేతరులను హెచ్చరిస్తున్నారు.